టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంటికి పోలీసులు... అందుకేనా....

ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్నటువంటి భారతీయుడు 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.

శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

అయితే ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా క్రేన్ ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరియు లైట్ గా పని చేస్తున్నటువంటి మరో వ్యక్తి మరణించారు.

మరికొందరు గాయాల పాలయ్యారు.అయితే తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా పోలీసులు ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తులను ఆరా తీస్తున్నారు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో నటి కాజల్ అగర్వాల్ కూడా అక్కడే ఉండటంతో పోలీసులు కాజల్ ని విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.

Advertisement

అయితే వీటిపై కాజల్ స్పందించకపోవడంతో పోలీసులు ఆమె నివాసం ఉంటున్నటువంటి ఇంటికి వెళ్లినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.దీంతో ఈ విషయంపై పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పోలీసుల విచారణలో భాగంగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న టువంటి కమల్ హాసన్ కూడా ఇటీవలె చెన్నై ఎగ్మోర్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.ఈ విషయం ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా కాజల్ ప్రస్తుతం ముంబై సాగా అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

అలాగే తమిళ్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నవటువంటి మరి చిత్రానికి కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు