టికెట్లు ఉన్నా గిరిజన కుటుంబాన్ని అనుమతించని ప్రముఖ థియేటర్.. చివరకు?

Chennai Based Theatre Rohini Silver Screens Clarify The Issue Of Boycott Rohini Theatre Details, Rohini Theater, Tribal Family, Hero Shimbu, Pathu Thala Movie, Chennai, Tamil Nadu, Chennai Theater, Rohini Theater Incident,

ఈ మధ్య కాలంలో మన దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.తమిళనాడు రాష్ట్రంలోని( Tamil Nadu ) ఒక థియేటర్ లో ఒక కుటుంబం విషయంలో థియేటర్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Chennai Based Theatre Rohini Silver Screens Clarify The Issue Of Boycott Rohini-TeluguStop.com

టికెట్ ఉన్నా గిరిజన కుటుంబాన్ని మొదట ప్రముఖ థియేటర్ యాజమాన్యం అనుమతించలేదు.చెన్నైలోని రోహిణి థియేటర్ లో( Rohini Theater ) ఈ ఘటన చోటు చేసుకుంది.

శింబు హీరోగా తెరకెక్కిన పతు తలా( Pathu Thala ) అనే మూవీ నిన్న థియేటర్లలో విడుదల కాగా ఒక గిరిజన కుటుంబం తమ నలుగురు పిల్లలతో కలిసి థియేటర్ కు వచ్చింది.అయితే టికెట్లు ఉన్నా థియేటర్ సిబ్బంది వాళ్లను అనుమతించకపోవడంతో కొంతమంది ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.

సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే రోహిణి థియేటర్ యాజమాన్యం మాత్రం పతు తలా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఉందని చట్ట ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించకూడదని అందుకే మా సిబ్బంది ఆపేశారని చెప్పారు.అయితే వాస్తవం ఏంటంటే యూ/ఏ సర్టిఫికెట్ సినిమాలను పేరెంట్స్ సమక్షంలో పిల్లలు చూడొచ్చని చట్టం చెబుతోంది.ఈ ఘటన గురించి విచారణ జరపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

రోహిణి థియేటర్ వివరణ విషయంలో నెటిజన్లు సంతృప్తికరంగా లేదు.థియేటర్ల దగ్గర కూడా సమానత్వం లేకపోతే ఎలా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.రోహిణి థియేటర్ ను బాయ్ కాట్ చేయాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పతు తలా సినిమా పాజిటివ్ టాక్ తో తమిళనాడులో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Chennai Based Theatre Rohini Silver Screens Clarify The Issue Of Boycott Rohini Theatre - Telugu Rohini Theatre #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube