కెరీర్ విషయంలో సరిగ్గా ఫోకస్ చేస్తే ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించడం సులువేననే సంగతి తెలిసిందే.టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తో కోట్ల రూపాయల డబ్బు సంపాదించవచ్చని సంజీవ్ కపూర్( Chef Sanjeev Kapoor ) అనే చెఫ్ ప్రూవ్ చేశారు.
ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ గా పేరు సంపాదించుకున్న ఈ చెఫ్ ఆదాయం ఏకంగా 750 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.సంజీవ్ కపూర్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
1964వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని( Punjab ) అంబాలాలో జన్మించిన సంజీవ్ కపూర్ హోటల్ మేనేజ్ మెంట్ లో( Hotel Management ) డిప్లొమా పూర్తి చేశారు.అలియోనా కపూర్ ను పెళ్లి చేసుకున్న సంజీవ్ కపూర్ 1984లో తన వృత్తిని ప్రారంభించారు.1992 సంవత్సరంలో ఒక టీవీ షోకు హోస్ట్ గా పని చేసిన సంజీవ్ కపూర్ ఆ టీవీ షోను 18 సంవత్సరాల పాటు నడిపించడం గమనార్హం.

ఈ షో ఏకంగా 120 దేశాలలో ప్రసారం కావడంతో పాటు 500 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.2011 సంవత్సరంలో సంజీవ్ కపూర్ ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానెల్ ను మొదలుపెట్టారు.సంజీవ్ కపూర్ వండర్ చెఫ్( Wonder Chef ) అనే సంస్థను సైతం స్థాపించగా ఈ సంస్థ ఆదాయం 700 కోట్ల రూపాయలుగా ఉంది.
ఈ సంస్థలో 40 శాతం మంది విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు.

సంజీవ్ కపూర్ ఆస్తుల విలువ 750 కోట్ల రూపాయలు అని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.14 దేశాలలో వంటగది ఉపకరణాలతో పాటు వంటగది సామాగ్రిని విక్రయిస్తున్నారు.సంజీవ్ కపూర్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.
సంజీవ్ కపూర్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.సంజీవ్ కపూర్ ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







