బాలయ్య బాబీ కాంబినేషన్( Balakrishna , Bobby ) క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సితార బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది.
మీనాక్షి చౌదరి, త్రిష, ఊర్వశి రౌతేలా( Urvashi Rautela , Meenakshi Chaudhary ) ఈ సినిమాలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

బాలయ్య బాబీ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.బాలయ్య పాత్ర మూడు కోణాల్లో ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా బాలయ్య నటన ఉండనుందని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ప్రధాన తారాగణంపై షూట్ చేస్తున్నారని ఆ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయని తెలుస్తోంది.యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య బాబీ కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని నందమూరి అభిమనులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెకుతున్న సినిమాలు సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంట్ నిజమవుతుందేమో చూడాల్సి ఉంది.బాలయ్య బాబీ కాంబో సూపర్ కాంబో అని ఫ్యాన్స్ చెబుతున్నారు.బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కాగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే ఈ కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
బాలయ్య స్పీడ్ కు తగిన విజయాలు దక్కాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాలయ్య మార్కెట్ మరింత పెరగాలని అభిమానులు ఫీలవుతున్నారు.బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుండగా త్వరలో మోక్షజ్ఞ( Mokshagna Teja ) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.







