చిత్తూరు జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.వి కోటలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
ఈ క్రమంలోనే నక్కనపల్లిలో చిరుత ఓ కుక్కను వేటాడింది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
బయటకు రావాలంటేనే జంకుతున్నారు.అనంతరం చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.చిరుతపులి పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు.







