తల్లితో గారాబం పోతున్న ఈ పిల్ల ఏనుగుని చూడండి... మనసుకి హత్తుకొనే సన్నివేశం మీకోసం!   

సోషల్ మీడియా విస్తృతి బాగా పెరగడం వలన ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా, ఇంకొన్ని వీడియోలు జనాల్ని చాలా ఎమోషనల్ కి గురయ్యేలా చేస్తాయి.

 Check Out This Baby Elephant Frolicking With Its Mother ,elephant, Viral Video,-TeluguStop.com

ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఫన్నీ సన్నివేశాలకు సంబంధించినవే ఉంటాయి.అలాంటి వాటినే నెటిజన్లు ఎక్కువగా చూసి ఆనందిస్తుంటారు.

పిల్లలు సైతం ఏనుగులు, కోతులు, జీబ్రాలు, కుందేళ్లు వంటి కొన్ని రకాల జంతువుల వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఓ పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు గురించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తల్లిని ఆటపట్టించే ఓ పిల్ల ఏనుగు వీడియో ఇది.ఇక ఈ వీడియోలో ఏముందంటే, ఓ పిల్ల ఏనుగు పిల్లాడిలా రోడ్డుపై దొర్లుతూ తిరుగుతోంది.అమ్మ ఆహారం సేకరణ కోసం వెళ్తుంటే.నేను వెంట వస్తానంటూ వెంటపడుతున్నట్టుగా అనిపించింది ఈ వీడియో.వీడియోలో, ఒక పిల్ల ఏనుగు అల్లరి చేయడం చూడవచ్చు, కానీ తల్లికి దానిని శాంతింపజేసే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది.

ఈ వీడియోను IFS అధికారి సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా చాలామంది దీన్ని వీక్షిస్తున్నారు.ఇంత క్యూట్‌గా ఉన్న ఈ వీడియోకు 30.3k వీక్షణలు, వేల సంఖ్యలోలు లైక్‌లు వచ్చాయి.ఏనుగు పిల్ల చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తుందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్లు పిల్ల ఏనుగు చేసిన అల్లరి చేష్టలను ఆస్వాదిస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.మీరు కూడా సదరు వీడియో తిలకించి మీ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube