మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!

ప్రముఖ అమెరికన్‌ ఫిట్‌నెస్ ట్రైనర్ నిక్ రీహెర్జర్(American fitness trainer Nick Reherzer) మోకాళ్ల నొప్పితో (knee pain)బాధపడుతున్నవారికి ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు.

తాను స్వయంగా ఎన్నో ఏళ్లుగా మోకాళ్ల నొప్పితో నరకయాతన అనుభవించానని, చివరకు ఓ 20 నిమిషాల వ్యాయామంతో తన సమస్యకు చెక్ పెట్టానని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram)వెల్లడించారు.

"నిజంగా చెప్పాలంటే ఈ వ్యాయామాలే నా మోకాళ్లను కాపాడాయి." అని నిక్ సంతోషంగా తెలిపారు.

నిక్ ప్రకారం, మూడేళ్ల క్రితం ఆయన మోకాళ్ల నొప్పి ఏ స్థాయిలో ఉండేదంటే, కనీసం ఆటలు ఆడటానికి, వ్యాయామం చేయడానికి కూడా వీలుండేది కాదు.చివరికి మెట్లు దిగడం, నిలబడటం లాంటి చిన్న పనులు కూడా ఆయనకు నరకంగా అనిపించేవి.

అలాంటి సమయంలో ఆయన స్నేహితుడొకరు "జీరో ప్రోగ్రామ్"(Zero Program)ను ప్రయత్నించమని సలహా ఇచ్చారు.దీన్ని ట్రై చేశాక కేవలం 12 వారాల్లోనే తన మోకాళ్ల నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని, తన మోకాళ్లు మునుపటిలా తయారయ్యాయని నిక్ చెప్పారు.

Advertisement

ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి నొప్పి లేకుండా ఆటలు ఆడుతూ, తన అథ్లెటిక్ నైపుణ్యాలను తిరిగి పొందుతున్నానని ఆయనన్నారు.వైరల్ వీడియోలో నిక్ చెప్పిన వర్కౌట్ మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది, శరీర భాగాల వంపులను మెరుగుపరుస్తుంది, తద్వారా నొప్పిని తగ్గిస్తుంది.

మోకాళ్ల (Knee)సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ వ్యాయామాన్ని ప్రయత్నించమని ఆయన సూచిస్తున్నారు.అయితే, శరీరం చెప్పే సంకేతాలను వింటూ, అసౌకర్యంగా ఉంటే మార్పులు చేసుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు.

20 నిమిషాల్లో మోకాళ్ల నొప్పికి చెక్ పెట్టే వ్యాయామాలు ఏమో చూస్తే, వెనక్కి నడవడం (5 నిమిషాలు): ఇది మోకాళ్లపై ఒత్తిడి లేకుండా, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.టిబియాలిస్ రైజ్ (2 సెట్లు, ఒక్కో సెట్‌కు 20 రిపిటిషన్స్): కాలు కింది భాగంలోని టిబియాలిస్ యాంటీరియర్ కండరాన్ని బలోపేతం చేస్తుంది.స్ట్రెయిట్ లెగ్ కాఫ్ రైజ్ (2 సెట్లు, ఒక్కో సెట్‌కు 15 రిపిటిషన్స్): కాలి వెనుక భాగంలోని గ్యాస్ట్రోక్నిమియస్ కండరాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది.

బెెంట్ నీ కాఫ్ రైజ్ (2 సెట్లు, ఒక్కో సెట్‌కు 15 రిపిటిషన్స్): కాలి వెనుక భాగంలోని సోలియస్ కండరాన్ని బలోపేతం చేస్తుంది.రివర్స్ స్టెప్-అప్స్ (2 సెట్లు, ఒక్కో సెట్‌కు 15 రిపిటిషన్స్): క్వాడ్రిసెప్స్, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్, కాఫ్ కండరాలపై దృష్టి పెడుతుంది.ఏటీజీ స్ప్లిట్ స్క్వాట్ (5 సెట్లు, ఒక్కో సెట్‌కు 5 రిపిటిషన్స్): క్వాడ్స్, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్, హిప్ ఫ్లెక్సర్‌లలో బలాన్ని పెంచుతుంది.ఏటీజీ స్క్వాట్ (5 సెట్లు, ఒక్కో సెట్‌కు 5 రిపిటిషన్స్): ఇది ఒక డీప్ స్క్వాట్.ఇది దిగువ శరీరాన్ని బలోపేతం చేయడంతో పాటు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది.

చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!
వీడియో: ఇది కదా మాతృత్వం అంటే.. స్పృహలేని పిల్లను వెటర్నరీకి మోసుకెళ్లిన కుక్క..

ప్రస్తుతం నిక్ చాలా మందికి ఇదే తరహా ఫలితాలు వచ్చేలా సహాయం చేస్తున్నారు.మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు సహాయం కోసం తనను సంప్రదించవచ్చని ఆయన ప్రోత్సహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు