ఛత్రపతిని మరీ పాకిస్తాన్‌ వరకు తీసుకు వెళ్లడం అవసరమా వినాయక్ గారు?

ప్రభాస్ ( Prabhas ) హీరోగా రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి ( Chhatrapati ) సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమా యొక్క అధికారిక రీమేక్ తాజాగా హిందీలో రూపొందింది.

 Chatrapathi Remake Interesting Update, Prabhas, Vv Vinayak, Rajamouli,-TeluguStop.com

ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హిందీ ఛత్రపతి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Telugu Bellamkondasai, Chatrapathy, Prabhas, Rajamouli, Vv Vinayak-Movie

ఇప్పటి వరకు ఓ స్థాయి బజ్ ని మాత్రమే క్రియేట్‌ చేయగలిగిన ఈ సినిమా పై అంచనాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దర్శకుడు వివి వినాయక్‌ ( V V Vinayak ) ఈ సినిమా కు దర్శకుడు అనే విషయం తెల్సిందే.రీమేక్‌ పై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Srinivas ) చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.

ఈ సినిమా తో హిందీతో పాటు పాన్ ఇండియా రేంజ్ ( Pan India Range ) లో సత్తా చాటేందుకు గాను దర్శకుడు వివి వినాయక్‌ మరియు బెల్లంకొండ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలుగు ఛత్రపతి సినిమా యొక్క మెయిన్‌ లైన్‌ తీసుకుని మొత్తం స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చినట్లుగా దర్శకుడు వివి వినాయక్ పేర్కొన్నాడు.

Telugu Bellamkondasai, Chatrapathy, Prabhas, Rajamouli, Vv Vinayak-Movie

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా యొక్క టైటిల్‌ విషయమై కాస్త గందరగోళం ఏర్పడింది.అదే టైటిల్ కావాలనే ఉద్దేశ్యంతో ఆరు నెలల పాటు పోరాటం చేసి చివరకు దక్కించుకున్నారు.ఆ టైటిల్‌ కావాలి అని అంతగా కష్టపడ్డప్పుడు ఎందుకు అదే విధంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాకుండా విభిన్నంగా ప్లాన్‌ చేశారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.తాజాగా వినాయక్ మాట్లాడుతూ ఈ సినిమా లో పాకిస్తాన్ ( Pakistan ) నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఛత్రపతి తెలుగు సినిమా లో శ్రీలంక ( Sri Lanka ) నుండి వచ్చినట్లుగా చూపించారు.అయితే ఇక్కడ పాకిస్తాన్ నుండి వచ్చినట్లుగా చూపిస్తారేమో.మొత్తానికి కాన్సెప్ట్‌ మాత్రం సేమ్ అయినా కూడా కథను పాకిస్తాన్ వరకు తీసుకు వెళ్లడం అవసరమా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube