ఇప్పుడు ఎక్కడ బట్టినా చాట్ జీపీటీ( ChatGPT ) గురించి జోరుగా చర్చ జరుగుతోంది.టెక్నాలజీ ప్రపంచంలో ఇదోక సంచలనంగా మారింది.
చాట్ జీపీటీ ప్రతి రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.ఎన్నో పనులు సులువుగా పూర్తి అవుతున్నాయి.
ఏమి కావాలన్నా సరే చాట్ జీపీటీని అడిగితే క్షణాల్లో చెప్పేస్తుంది.మీ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేస్తుంది.
సమాచారం ఇవ్వడమే కాకుండా అనాలసిస్ చేసి మనకు సమాధానాలు ఇస్తుంది.ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే చాట్ జీపీటీ రాకతో కంపెనీలకు పని సులువవ్వగా.
ఉద్యోగాలు మాత్రం పెద్ద సంఖ్యలో పోతున్నాయి.
అయితే ఓపెన్ ఏఐ( Open AI ) అనే సంస్థ చాట్ జీపీటీని తయారుచేసిన విషయం తెలిసిందే.కానీ ఇప్పటివరకు చాట్ జీపీటీ యాప్( ChatGPT App ) లేదు.దీంతో ఆండ్రాయిడ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఓపెన్ ఏఐ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఆండ్రాయిడ్ యాప్ ను తయారు చేయగా.త్వరలోనే లాంచ్ చేయనుంది.
దీని వల్ల ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సులువుగా చాట్ జీపీటీని యాక్సెస్ చేయవచ్చు.ఇప్పటికే ఐవోఎస్ ఫ్లాట్‌ఫామ్ లో చాట్ జీపీటీ యాప్ తీసుకురాగా.
అది బాగా సక్సెస్ అయింది.దీంతో ఆండ్రాయిడ్ వెర్షన్ లో కూడా తీసుకురానున్నారు.
ఐవోఎస్ ఫ్లాట్‌ఫామ్‌లో చాట్ జీపీటీని లాంచ్ చేసిన మొదటివారంలో 5 లక్షల డౌన్‌లోడ్స్అయ్యాయి.వెబ్ బ్రౌజర్ లోకి వెళ్లి సెర్చ్ చేసి ఉపయోగించాలంటే ఆలస్యం అవుతుంది.అదే యాప్ ద్వారా అయితే సులువుగా చాట్ జీపీటీని యాక్సెస్ చేసుకోవచ్చు.దీంతో ఆండ్రాయిడ్ యాప్ ను వచ్చే వారం అమెరికాలో లాంచ్ చేయనున్నారు.ఆ తర్వాత ఇతర దేశాల్లో విడుదల చేయనున్నారు.ఆగస్టు చివరివారం నాటికి అన్ని దేశాల్లో చాట్ జీపీటీ యాప్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది.
ఇది వస్తే యాక్సెస్ చేయడం మరింత సులువు కానుంది.