ఇటీవలే కాలంలో ఆన్లైన్ లో షాపింగ్( Online shopping ) చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది.ఆన్లైన్లో షాపింగ్ ప్రక్రియ క్షణాల్లో పూర్తి చేయడంలో చాట్ జీపీటీ ప్లగిన్ కెపాసిటీ అదుర్స్.
ఈ ప్లగిన్ తో ట్రావెలింగ్ డీటెయిల్స్, రెస్టారెంట్ బుకింగ్, ఆన్లైన్ షాపింగ్ లాంటి పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు.ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.? మన టేస్ట్ కు తగ్గ వివరాలు అందిస్తే చాలు.మన టేస్ట్ కు అనుగుణంగా చాట్ జీపీటీ ప్లగిన్ షాపింగ్ చేసేస్తుంది.

ప్రోడక్ట్ డిజైనర్ చాట్ జీపీటీ లో తన టేస్ట్ (Chat GPT )కు తగ్గట్టు కొన్ని వివరాలు చెప్పి డైట్ ప్లాన్ అడిగాడు.క్షణాల్లో పర్ఫెక్ట్ డైట్ ప్లాన్, సరుకుల సెలక్షన్ చేసేసింది.చాట్ జీపీటీ పనితీరు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.ప్రోడక్ట్ డిజైనర్ అమ్మార్ రేషి ఒక నిర్దిష్ట బడ్జెట్ కేటాయించి, కొన్ని ఫుడ్స్ తయారు చేయడానికి కావలసిన సరుకులు, అలాగే తయారు చేసే విధానం గురించి చాట్ జీపీటీ ను అడిగారు.
క్షణాల్లో కావలసిన సరుకులను ఇన్స్టా కార్డ్ డెలివరీ యాప్ లో సెలెక్ట్ చేసేసింది.మామూలుగా అయితే ఫుడ్ కు ఏ సరుకులు కావాలో వెతికి మరి ఆర్డర్ పెట్టాలి.
కానీ ఈ ప్లగిన్ తో చాట్ జీపీటీ కావలసినవన్నీ సెలెక్ట్ చేసి పెడుతుంది.

ప్రోడక్ట్ డిజైనర్ వంద డాలర్ల విలువైన కిరాణా సామాగ్రి కొనేందుకు దీనిని ఉపయోగించారు.తాను బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో ఏం తినాలి అనుకున్నాడో వాటి గురించి చెబితే క్షణాల్లో కిరాణా సరుకుల ఎంపిక, వంటకాలతో చాట్ బాట్ స్పందించింది.

ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి ఎటువంటి డైట్ ఫాలో అవాలో( Diet ) తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు.అయితే చాట్ జీపీటీ ప్లగిన్ తొ ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరికినట్టే.జస్ట్ యూజర్లు తమకు ఎటువంటి టెస్ట్ ఉంటే నచ్చుతుందో ఆ వివరాలు ఇస్తే పక్కా డైట్ ప్లాన్ సెలెక్ట్ చేయడంతో పాటు కావలసిన సరుకులను కూడా సెలెక్ట్ చేసేస్తుంది.
ఈ టెక్నాలజీతో రోజువారీ పనులను సులభతరం చేసుకోవచ్చు.







