హైదరాబాద్ లోని( Hyderabad ) నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్( Charminar Super Fast Express ) పట్టాలు తప్పింది.చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన తరువాత రైలును వెనక్కి తీస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
దీంతో పట్టాలు తప్పిన మూడు బోగీలు ప్లాట్ ఫాం గోడలను ఢీకొట్టాయి.ఈ ప్రమాదంలో సుమారు యాభై మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

మరి కొంతమందరు తీవ్ర భయాందోళనకు గురవడంతో గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది.బాధితులను రైల్వే అధికారులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.అయితే లోకో ఫైలట్( Loco Pilot ) అజాగ్రత్తగా వ్యవహారించడం వలనే ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.మైనర్ ప్రమాదమేనన్న అధికారులు ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.







