హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో( LB Nagar ) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది.రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో బైకును కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీ( Excise CI Sadiq Ali ) ఘటనా స్థలంలోనే మృతిచెందారు.అలాగే నారాయణగూడ ఎస్ఐ ఖాజావలి మొహినుద్దీన్ కు గాయాలు అయ్యాయి.
బైకుపై సీఐ సాధిక్ అలీ, నారాయణగూడ ఎస్ఐ వెళ్తుండగా.రాంగ్ రూట్ లో వచ్చిన కారు ఢీకొట్టిందని తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు