ఈమద్య యంగ్ హీరోల మద్య స్నేహపూర్వక వాతావరణ కనిపిస్తుంది.ఒకరి సినిమాలకు ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం, నా సినిమాతో పాటు ఆ సినిమా కూడా ఆడాలి అంటూ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం.
ఇటీవల ఒక కార్యక్రమం కోసం విజయవాడ వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాలపై స్పందించిన విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున సంక్రాంతికి విడుదల కాబోతున్న నాలుగు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అన్నాడు.
అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, దర్బార్ మరియు ఎంత మంచి వాడవురా సినిమాలను ప్రేక్షకులు ఆధరించాలంటూ రామ్ చరణ్ కోరాడు.ఈ నాలుగు సినిమాలు సక్సెస్ అయ్యి మంచి వసూళ్లు వచ్చి నిర్మాతలు మరియు బయ్యర్లు మంచి లాభాలను దక్కించుకోవాలంటూ కోరుకున్నాడు.
చరణ్ తర్వాత ఎన్టీఆర్ కూడా నాలుగు సినిమాలు సక్సెస్ అవ్వాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎంత మంచి వాడవురా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చాడు.

సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న తన అన్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న జరపడం జరిగింది.ఆ వేడుకలో భారీ ఎత్తున నందమూరి అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మా సినిమాతో పాటు సంక్రాంతికి విడుదల కాబోతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.
ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ఆ మూడు సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.