తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాలో మార్పు చేర్పులు ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్( Congress ) వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోను( Parliament Elections ) మెజారిటీ సీట్లను కాంగ్రెస్ ఖాతాలో వేసి చాటుకోవాలని చూస్తోంది.దీనిలో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ, గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తున్నారు.

 Changes In The List Of Candidates Of Telangana Congress Details, Kc Venugopal, C-TeluguStop.com

ఇప్పటికే నలుగురు మినహా మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు.అయితే ఎంపీ స్థానాల్లో అభ్యర్థులలో కొంతమంది ని మార్చే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా , గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

Telugu Aicc, Congress, Kc Venugopal, Pcc, Sunil Kanugolu, Telangana-Politics

ఈ మేరకు ఈరోజు సాయంత్రం ఏఐసిసి కీలక నేత కేసి వేణుగోపాల్( KC Venugopal ) ఎంపీ అభ్యర్థుల తో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి,( CM Revanth Reddy )  ఉప ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు.రాష్ట్ర నాయకుల ప్రమేయం లేకుండా ఏఐసిసి( AICC ) స్వయంగా ఫ్లాష్ సర్వేను చేయించిందట.

అలాగే కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) టీం తో మరో సర్వే చేయించినట్లు తెలుస్తోంది.  ఈ రెండు సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్న వారిని పోటీకి దించాలని ఆలోచనకు ఏఏసిసి పెద్దలు వచ్చారట.

Telugu Aicc, Congress, Kc Venugopal, Pcc, Sunil Kanugolu, Telangana-Politics

ఈ మేరకు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో  మార్పులు, చేర్పులు చేసే ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు సమాచారం.అలాగే టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న వారిని ముందుగానే బుజ్జగించి ఎన్నికల్లో వారి కారణంగా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యతలు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు తెలుస్తోంది.గత ఎన్నికల్లోను భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అసంతృప్తులను బు జ్జగించడంలో కీలకపాత్ర వహించిన నేపథ్యంలో వారికి ఆ బాధ్యతలను అప్పగించబోతున్నారట.మొత్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించింది పూర్తి స్థాయిలో జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారంపై నే దృష్టిపెట్టబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube