ఏపీ డీఎస్సీ ( AP DSC )షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.డీఎస్సీ -2024 షెడ్యూల్ లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.
ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు.ఈ ప్రకారం ఈ నెల 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
అలాగే ఈ నెల 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా సుమారు 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో ఈ పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ను రూపొందించారు.అయితే రాష్ట్రంలో 6,100 టీచర్ల నియామకం కోసం డీఎస్సీ 2024 షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఎస్జీటీ అర్హతల మార్పుతో పాటు టెట్( AP-TET ) కు డీఎస్సీకి మధ్య తగిన సమయం ఇవ్వడం వలన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ( botsa satyanarayana ) వెల్లడించారు.