చంద్రయాన్3 సక్సెస్ కావడం వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

చంద్రయాన్3 ( Chandrayaan 3 )ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మన దేశంలోని ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు.54 మంది మహిళలు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయడం గమనార్హం.

చంద్రయాన్3 రోవర్ చంద్రుడి కోసం భారత్ లో తయారైందని అది ల్యాండర్ నుంచి సాఫీగా బయటకు వచ్చిందని దాంతో భారత్ చంద్రుడిపై నడిచిందని ఇస్రో పేర్కొంది.ప్రస్తుతం రోవర్ తన అధ్యయనం మొదలుపెట్టిందని ఇస్రో పేర్కొంది.చంద్రయాన్3 సక్సెస్ కావడం వల్ల మన దేశం టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది.భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలకు ఊతం లభించడంతో పాటు అంతరిక్ష పరిశోధనలలో మన దేశం ఎంతో అభ్యున్నతి సాధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రయాన్ ప్రయోగం రెండుసార్లు ఫెయిలైనా మూడోసారి అద్భుతమైన విజయాన్ని సాధించడం గమనార్హం.

ఈ ప్రాజెక్ట్ సక్సెస్ తో ప్రపంచ దేశాల దృష్టిని భారత్( India ) ఆకర్షించింది.మన దేశ స్పేస్ రీసెర్చ్ విషయంలో ఇతర దేశాలు సైతం పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.చంద్రయాన్3 ప్రాజెక్ట్ సక్సెస్ తో ఇతర దేశాలు తమ ప్రాజెక్ట్ ల విషయంలో భారత్ సహాయం కోరే అవకాశం ఉంది.మన దేశం ఆర్థికంగా ఎదిగే అవకాశాలు సైతం ఉన్నాయి.

ల్యాండర్ విక్రమ్( Lander Vikram ) మోసుకెళ్లిన రోబోటిక్ యంత్రం రోవర్ పేరు ప్రజ్ఞాన్ ( Pragyan )కాగా ఇందులో ఉండే రెండు పెలోడ్ లు చంద్రుడి ఉపరితల వాతావరణ మౌలిక కూర్పుకు సంబంధించిన సమాచారం అందిస్తాయి.

Advertisement

రెండు పెలోడ్ లలో ఒకటి ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్టోమీటర్‌ ఒకటి కాగా లేజర్‌ ఇండ్యూస్ట్‌ బ్రేక్‌ డౌన్‌ స్పెక్ట్రోస్కోప్ మరొకటి కావడం గమనార్హం.మట్టి, రాళ్లలోని రసాయనాలను గుర్తించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.చంద్రయాన్3 ప్రాజెక్ట్ సక్సెస్ కు కారణమైన శాస్త్రవేత్తలపై ప్రముఖ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు