భారీ ధరలకు చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్... స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ అంటే?

డైరెక్టర్ పి.

వాసు దర్శకత్వంలో రజనీకాంత్ జ్యోతిక నయనతార వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి( Chandra Mukhi ) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా విడుదలైనటువంటి 17 సంవత్సరాలకు చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయింది.

ఈ సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ స్థానంలో నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటించిన జ్యోతిక స్థానంలో ప్రముఖ నటి కంగనా నటించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనదని చెప్పాలి.ఇక ఇప్పటికే థియేటర్లో భారీగా కలెక్షన్స్ పడిపోయాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఏకంగా 8 కోట్ల రూపాయలతో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాని థియేటర్లలో విడుదలైన నెలన్నర తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని భావించారు అయితే థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాకపోవడంతో ముందుగానే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.ఈ క్రమంలోనే అక్టోబర్ మూడవ వారంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారక ప్రకటన తెలియజేయునుంది.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు