టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈరోజు ఉదయం స్వర్గీయ ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో పర్యటించడం జరిగింది.
ఈ క్రమంలో బసవతారకం పుట్టినూరు కొమురవెల్లిలో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళి అర్పించారు.అనంతరం నిమ్మకూరు నుంచి భారీ ర్యాలీగా గుడివాడ బయల్దేరారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గుడివాడలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వాగతం పలకడానికి రెడీ అయ్యారు.ఇటువంటి తరుణంలో గుడివాడలో శరత్ థియేటర్ వద్ద టీడీపీ( TDP ).వైసీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగాయి.

ఒకరిపై మరొకరు రోడ్డుపై దాడులు చేసుకోవడం జరిగింది.పార్టీ జెండాల విషయంలో వివాదం నెలకొనటంతో చంద్రబాబు రాకముందే… గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.దీంతో పెద్ద ఎత్తున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది.
అనంతరం గుడివాడకు చేరుకున్న పార్టీ అధినేత చంద్రబాబుని భారీ గజమాలతో స్థానిక నేతలు.కార్యకర్తలు స్వాగతం పలికారు.గుడివాడలో కోతి బొమ్మసెంటర్, బస్ స్టాండ్ సెంటర్ మీదుగా చంద్రబాబు రోడ్ షో( Road Show ) ప్రారంభమైంది.







