Chandrababu Naidu: నియోజకవర్గ ఇన్‌చార్జీల భేటీలో వైసీపీ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాజకీయంగా ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాల కారణంగా తాము ఫినిష్ అయ్యామన్న పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని అన్నారు.

 Chandrababu Serious Comments On Ycp In The Meeting Of Constituency In-charges De-TeluguStop.com

రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రితో పాటు వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.వైసీపీ నేతలలో లోపల ఓటమి భయం వారికి నిద్ర లేకుండా చేస్తోంది.

జగన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు.రాష్ట్రంలో అందరూ ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు.

అందువల్లే టీడీపీ సభలకి భారీ జనం రావడంతో… వైసీపీలో కలవరం మొదలైందని తెలిపారు.

ప్రత్యర్థులపై అణిచివేత ధోరణి వైసీపీ ప్రభుత్వానికి చాలా నష్టం చేసింది.

దీంతో అంగబలం, అర్థబలం సహా ఏది కూడా వైసీపీ ప్రభుత్వాన్ని రక్షించలేదన్న వాస్తవాన్ని… వైసీపీ నేతలు గుర్తించారని చంద్రబాబు తెలియజేశారు.తన జిల్లాల పర్యటనలకు జనం నుండి వస్తున్న స్పందన వైసీపీలో కలవరం స్టార్ట్ చేసింది.అందువల్లే వైసీపీ జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు.ఇంకా అధికార పార్టీ బీసీ నేతల రేపటి సమావేశం కూడా.

ఈ ఆందోళనకు ఒక నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన జగన్ ప్రభుత్వం పై నెగిటివ్ టాక్ ఉంది.

అది వైసీపీ నాయకులకు కూడా తెలుసు అంటూ ఇన్‌చార్జీలతో చంద్రబాబు పేర్కొన్నారు.

Telugu Chandrababu, Cmjagan, Ycp, Ysrcp-Political

ప్రభుత్వం పోలీసులను పెట్టుకుని ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేస్తోంది.చివరాఖరికి పులివెందులలో కూడా జగన్ రెడ్డికి ఎదురుగాలి మొదలైందని.చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇన్‌చార్జీల భేటిలో పలు సూచనలు ఇవ్వడంతో పాటు వారి దగ్గర… ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది.“బాదుడే బాదుడు” మరియు “ఇదేం కర్మ” వంటి కార్యక్రమాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని.సోషల్ మీడియాలో మంచి ప్రచారం కల్పించాలని ఇన్‌చార్జీలకి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube