బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు సైకిల్ కు తుప్పు పట్టిందన్నారు.
ఈ తుప్పుపట్టిన సైకిల్ కు వేరే పార్టీలు కావాలని తెలిపారు.చంద్రబాబు ఏది చెబితే జనసేనాని పవన్ కల్యాణ్ అది చేస్తారని పేర్కొన్నారు.
చంద్రబాబుకు ప్యాకేజ్ స్టార్ తోడు అయ్యారన్న సీఎం జగన్ తక్కువగా సీట్లు ఇస్తున్నారని పవన్ చంద్రబాబును అడగరని విమర్శించారు.చంద్రబాబు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా ఫలితం సున్నా అని చెప్పారు.2014 లోనూ ఇలాగే పొత్తు పెట్టుకున్నారన్న ఆయన అప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని తెలిపారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా అని ప్రశ్నించారు.
మరోసారి మోసం చేసేందుకు పొత్తులతో వస్తున్నారన్నారు.జగన్ ను టార్గెట్ చేయడమే వీళ్ల ఎజెండా అని సీఎం జగన్ పేర్కొన్నారు.
దోచుకుని, పంచుకోవడానికే చంద్రబాబుకు అధికారం కావాలన్నారు.చంద్రబాబు కిచిడి మ్యానిఫెస్టో తయారు చేశారని విమర్శించారు.







