ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు భవిష్యత్ కే గ్యారెంటీ లేదని విమర్శించారు.అలాంటిది ప్రజల భవిష్యత్ కు చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా అని ప్రశ్నించారు.
మహిళలు, రైతులు, యువతను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.ఎన్నికల సందర్భంగా ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ బూటకమని విమర్శించారు.