జగన్ కు చంద్రబాబు విషెస్ ! ఆడేసుకుంటున్న సోషల్ మీడియా 

నిన్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు( Ys Jagan Birthday ) సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా ఉత్సాహంగా జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

 Chandrababu Naidu Wishes For Jagan Viral On Social Media , Bjp, Prime Minister-TeluguStop.com

ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు.ప్రతి నియోజకవర్గంలోనూ రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ఇక జగన్ నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.

చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు.  వారి మధ్యనే పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు .ఈ సందర్భంగా భారీ కేకున కట్ చేసి పుట్టినరోజులు చేసుకున్నారు.

జగన్ పుట్టినరోజు సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) తో పాటు,  సినీ ప్రముఖులు ఎంతోమంది జగన్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్ లో తమ అభిమానాన్ని చాటుకున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక ఈ జాబితాలో టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు.

కాకపోతే  జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన తీరును తప్పుపడుతూ మీడియా,  సోషల్ మీడియాలో చంద్రబాబుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ( ట్విట్టర్ ) లో హ్యాపీ బర్త్ డే అని సింగిల్ కాలంలో రాసి,  దానిని జగన్ కు టాగ్ చేశారు.అయితే ఈ విధానంపైనే దుమారం రేగుతోంది  ప్రధాని నరేంద్ర మోదీ సైతం జగన్ కు విషెస్ చెబుతూ గారు అని గౌరవప్రదంగా సంబోధించారని,  మిగతా వారు ఇదే రకంగా జగన్ ను గౌరవిస్తూ ట్విట్ చేశారని , చంద్రబాబు ( Chandrababu Naidu )మాత్రం ఏకవాక్యంలో శుభాకాంక్షలు చెప్పిన తీరు ను చూస్తే ఆయనే తనను జైలులో పెట్టించారని కోపం ఇంకా చల్లారినట్టు లేదని అందుకే తన కోపాన్ని ఈ విధంగా ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇదే విషయంపై వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై తీవ్రంగా ట్రోల్స్ తీవ్రంగా మొదలయ్యాయి.

https://twitter.com/ncbn/status/1605461488281391104
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube