దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు( Nandhamuri Taraka ramarao ) ఒక మహోన్నత వ్యక్తి అనే విషయం అందరూ కచ్చితంగా ఒప్పుకోవాల్సిన మాట.అటు సినిమారంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన గుర్తింపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఆయన రాజకీయ రంగప్రవేశం తరువాత పోలిటిక్స్ లో చోటు చేసుకున్నా పరిణామాలు అన్నీ ఇన్ని కావు.అప్పటి వరకు ఏపీలో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ను పట్టికరిపించి మొదటిసరిగా ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.

ఇక ముఖ్యమంత్రి ( CM )పదవి చేపట్టిన తరువాత ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.ఇప్పటికీ కూడా ఆయన అమలు చేసిన పథకాలు, ప్రవేశ పెట్టిన విధానాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఆయన తరువాత ఆ స్థాయి నాయకత్వం, పాలన.ఎవరిది అనే ప్రశ్న ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.ఎన్టీఆర్ తరువాత టీడీపీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు( Chandrababu naidu ) ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసినప్పటికి.ఎన్టీఆర్ ను రీప్లేస్ చేసేంతలా చంద్రబాబు పాలన సాగలేదనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.
అంతేకాకుండా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా చంద్రబాబుపై నిత్యం ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.

దీంతో ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా చంద్రబాబుకు అర్హత లేదనేది చాలమంది నోట వినిపించే మాట.ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( CM KCR ) ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే సంగతి జగమెరిగిన సత్యం.మరి ఎన్టీఆర్ పై అంతటి అభిమానం చూపించే కేసిఆర్.
ఎన్టీఆర్ వారసుడిగా పాలన సాగిస్తున్నారా అంటే బిఆర్‌ఎస్ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు.ఎన్టీఆర్ లోని గొప్ప లక్షణాలు, సమర్థత కేవలం కేసిఆర్ లోనే ఉన్నాయని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్.ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడంలో కేసిఆర్ ముందున్నారని, ఆయనకు రాజకీయ వారసుడు కేసిఆర్ మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు.
మరి అటు ఏపీలో టీడీపీ నేతలు కూడా చంద్రబాబును ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా చెబుతున్నారు.దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ అసలైన రాజకీయ వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.