టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 7వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఏపీలో ఓట్ల అక్రమాలపై చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్న ఆయన జిల్లాల పర్యటనలు చేయనున్నారని సమాచారం.ఈ నెల 11 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు ప్రారంభం కానుండగా ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాలో ఆయన పర్యటించనున్నారని సమాచారం.చంద్రబాబు పర్యటనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.