అమలాపురం( Amalapuram ) బహిరంగ సభలో చంద్రబాబు( Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడు పార్టీలు కూటమిగా వచ్చింది స్వార్థం కోసం కాదు రాష్ట్రం బాగు కోసం అని అన్నారు.
వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది.అహంకారపూరితంగా విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది.2014 ఎన్నికలలో ప్రజా శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు.ఉభయగోదావరి జిల్లాలలో అన్ని స్థానాలలో గెలవడం జరిగింది.విభజన చట్టంలో అనేక అంశాలను రాష్ట్రంలో అమలయ్యేలా చేసాం.పోలవరం ప్రాజెక్టు కేంద్రం యొక్క సహకారంతో 70 శాతానికి పైగానే పూర్తి చేయడం జరిగింది.అదే పోలవరం( Polavaram ) వైసీపీ పూర్తి చేసి ఉంటే… గోదావరి జిల్లాలలో మూడు పంటలకు నీళ్లు వచ్చేవి.
రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.వ్యవసాయం, ఆక్వా రంగాలలో రాష్ట్రం వెనుకబడిపోయింది.మేము అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అద్భుతంగా ఉన్నాయి.పెట్టుబడులు, ఉద్యోగుల కల్పనాలో రాష్ట్రం ముందంజలో ఉండేది.వైసీపీ( YVP ) హయాంలో ఏ రైతైనా ఆనందంగా ఉన్నారా.? అంటూ చంద్రబాబు సంచలన ప్రశ్నలు వేశారు.కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం.కానీ ఇప్పుడు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు.యువతకు కనీసం ఉద్యోగాలు కూడా రాలేదు.డీఎస్సీ నిర్వహించలేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అని మండిపడ్డారు.
జాబు కావాలంటే.కూటమి అధికారంలోకి రావాలంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.