Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభలో( Prajagalam Sabha in Kadiri ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.బాబాయ్ ని చంపింది ఎవరు అంటూ సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

 Chandrababu Serious Comments In Kadiri Prajagalam Sabha-TeluguStop.com

ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని వైయస్ సమాధి సాక్షిగా జగన్( jagan ) అబద్ధాలు చెప్పారంటూ విమర్శించారు.మరోపక్క సునీత తనకు న్యాయం చేయాలని కోరుతున్నారని ఓ ఆడబిడ్డ ఆవేదన విన్నారు కదా.జగన్ కి సపోర్ట్ చేస్తారా.? సునీతకు సపోర్ట్ చేస్తారా.? అంటూ చంద్రబాబు( Chandrababu ) సభీకులను ఉద్దేశించి ప్రశ్నించారు.హత్య రాజకీయాలు మంచివి కావు.

నిన్న నంగనాచిలా మాట్లాడారు.ఇప్పుడు మనం కదిరిలో ఉన్నాం.

పక్కనే పులివెందుల ఉంది.

పులివెందులలో గొడ్డలి వేటు వేస్తే కదిరికి వినిపిస్తుందా.? లేదా.? ఆ గొడ్డలి ఇక్కడే తయారయిందని వార్తలు వచ్చాయి.నిన్న చెబుతున్నాడు కలియుగంలో నాపై ఆరోపణలు చేస్తున్నారు.నాకేం అర్థం కావడం లేదు.మా చిన్నాన్నను చంపేశారు అంటూ మళ్ళీ మొదటికి వచ్చాడు.డ్రామాలాడుతున్నారు.

కరకట్ట కమలహాసన్ అని చంద్రబాబు సెటైర్లు వేశారు.బాబాయ్ ని చంపింది ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు.

కానీ జగన్ బాబాయ్ ని చంపింది ఎవరో దేవుడికే తెలుసు.నేను ఏ తప్పు చేయలేదు అని చెబుతున్నాడు.

ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలా అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube