విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక సమయంలో దేశంలో చాలామంది ప్రాణాలను కాపాడింది అని విపక్షనేత చంద్రబాబు తెలిపారు.1000 పడకల ఆక్సిజన్ బెడ్లు కలిగిన ఆసుపత్రిలో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందేలా ముందుకు వచ్చి ప్రాణాలు నిలబెట్టింది అని రోజుకి దాదాపు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశంలో చాలా మందిని కాపాడటం జరిగిందని తెలిపారు.అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కదిలించడానికి కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పు పడుతూ గత వంద రోజుల నుండి దీక్షలో జరుగుతున్నాయి దీనిపై పార్లమెంట్లో వైసీపీ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని, అటువంటిది అసెంబ్లీలో తీర్మానం చేయడమనేది ప్రజలను మోసం చేయటం కాదా అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంతోమంది ప్రాణాలను కాపాడటం మాత్రమేకాక వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధి లో దోహదపడుతున్న విశాఖ పరిరక్షణ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు లేదని ఎలాంటి త్యాగాల కైనా టిడిపి రెడీగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.