అప్పుల పాలన... అబద్దాల జగన్ ! చంద్రబాబు పంచ్ లు ? 

టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ సొంత జిల్లాలో అడుగుపెట్టారు.గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించారు.

 Chandrababu Sensational Comments On Jagan , Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap,-TeluguStop.com

ఈ సందర్భంగా ఏపీ లో చోటు చేసుకున్న అనేక పరిణామాలపై బాబు స్పందించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన , జగన్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని, మూడు సంవత్సరాల్లో జగన్ అరాచకాలు అన్ని కాదని బాబు ఆరోపించారు.వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడు కొనసాగుతోందని , జగన్ పాలనలో వీరబాదుడు చేస్తున్నాడంటూ బాబు విమర్శించారు.
  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో అభివృద్ధి వెనుకబడి పోయిందని,  ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేదని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలు పెరిగిపోయాయని చంద్రబాబు విమర్శించారు.రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని , ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోల్ కరెంట్ ధరలు ఇక్కడే భారీగా పెంచారని విమర్శించారు .రాష్ట్రంలో టాక్స్ వేస్తూ బాదుడే బాదుడు చేస్తున్నారని విమర్శించారు.ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, ప్రస్తుత పరిస్థితి చూసి రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు కేంద్రం కూడా వెనుకడుగు వేస్తోందని బాబు విమర్శించారు.
 

Telugu Badudebadudu, Chandrababu, Jagan, Ys Jagan, Ysrcp-Telugu Political News

తండ్రిని అడ్డం పెట్టుకొని జగన్ 43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని , పాదయాత్రలో ముద్దులుపెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజలకు గుద్దులే గుద్దులు ఇస్తున్నాడని బాబు విమర్శించారు.జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని , జగన్ సొంత చిన్నాన్న హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని,  జగన్ ఊరు వెళ్లి రాజకీయాలు చేస్తున్నాడని బాబు అన్నారు.సొంత చెల్లిని మోసం చేసిన ఘనత జగన్ దేనని బాబు విమర్శించారు.

సిబిఐ డ్రైవర్ ను కూడా కొంతమంది చంపుతామని బెదిరిస్తున్నారని,  పోలీసులను చూస్తే జాలేస్తుంది అని , సిబిఐ పైన కూడా బాంబులు వేస్తే మీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు .పోలీసులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube