టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రస్తుతం కుప్పం( Kuppam ) పర్యటనలో ఉన్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని చంద్రబాబు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న చంద్రబాబు గూడుపల్లి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ( YCP ) సినిమా అయిపోయిందని ఆ పార్టీ ఇంకా వంద రోజులు మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు.
కుప్పం ప్రజలు సొంత కుటుంబం లాంటివారు.ఇక్కడి ప్రజలు 35 ఏళ్లుగా తనని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమాభిమానాలు అందించారని అన్నారు.
ఈసారి ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.కుప్పం గర్వపడే విధంగా ఇన్నేళ్లుగా గెలిపించారు.ఈ ప్రభుత్వంలో నాలాంటి వాడికే రక్షణ లేదంటే.సామాన్యుల పరిస్థితి ఏంటి.? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో మేనిఫెస్టో( TDP Manifesto ) అంశాలను కూడా చంద్రబాబు వెల్లడించడం జరిగింది.
ఆడబిడ్డలకు నెలకు 1500/- రూపాయలు.ఇస్తామని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని వ్యాఖ్యానించారు.అంతేకాదు తెలుగుదేశం పార్టీ ( TDP ) అధికారంలోకి వచ్చాక మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని అన్నారు.ఇదే సమయంలో రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అంటూ చంద్రబాబు భరోసా ఇవ్వటం జరిగింది.