ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ కామెంట్స్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాలో "మహానాడు" కార్యక్రమం నిర్వహిస్తూ మరోపక్క "బాదుడే బాదుడు" కార్యక్రమం చేపడుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఉన్నారు.దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసింది అని ప్రశ్నించారు.

Chandrababu Sensatational Comments On Ap Special Status Chandrababu, Tdp, Vijaya

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు కేంద్రం వద్ద మెడలు దించుతున్నారు అని ఎద్దేవా చేశారు.కేసులకు భయపడి కేంద్రం వద్ద మెడలు దించుతున్నారు అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా గాలికొదిలేశారని పేర్కొన్నారు.

Advertisement
Chandrababu Sensatational Comments On AP Special Status Chandrababu, TDP, Vijaya

ఇక తాను అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడా కరెంటు చార్జీలు పెంచలేదని.నిరంతరం కరెంట్ ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పుడు కరెంటు రావడం లేదని.

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.అన్ని చార్జీలు పెరిగిపోయాయి త్వరలో ఆర్టీసీ చార్జీలు కూడా వైసీపీ ప్రభుత్వం పెంచేయడానికి రెడీ అవుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో మంత్రి బొత్స పై సెటైర్లు వేశారు.ఉత్తరాంధ్రలో సారా వ్యాపారం చేసుకునే బొత్సకు విద్యామంత్రి ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు.

పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు ఫెయిల్ అయితే తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టలేదని.బొత్సచేసిన వ్యాఖ్యలకు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..

ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని.చంద్రబాబు సెటైర్లు వేశారు.

Advertisement

ఇంకా అనేక విషయాలపై సీరియస్ కామెంట్స్  చేసిన చంద్రబాబు.రాష్ట్రం బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని.

రోడ్ షోలో పేర్కొన్నారు.

తాజా వార్తలు