ఆచంట సభలో వైసీపీ మంత్రులపై చంద్రబాబు సెటైర్లు..!!

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో “రా కదలిరా” సభలో చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు( Nara Chandrababu naidu ) ప్రసంగిస్తూ వైసీపీ మంత్రులపై భారీ ఎత్తున సెటైర్లు వేశారు.

 Chandrababu Satires On Ycp Ministers In Achanta Sabha , Nara Chandrababu, Raa Ka-TeluguStop.com

ముందుగా పశ్చిమగోదావరి జిల్లా గొప్పతనం గురించి మాట్లాడుతూ మర్యాదకి మారుపేరు.ఈ ప్రాంత ప్రజలు అని ఎన్టీఆర్( NTR ) చెప్పే వారిని గుర్తు చేసుకున్నారు.

ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన కాటన్ ఇక్కడ బ్యారేజీ నిర్మించారని అన్నారు.

ఇక ఇదే సభలో వైసీపీ మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.డయాఫ్రమ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి.పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి.

ధాన్యానికి సంచులు ఇవ్వలేని వ్యక్తి వ్యవసాయ మంత్రి.గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి.

క్లబ్బులలో డాన్సులేసే ఆమె… మహిళ సంక్షేమం గురించి మాట్లాడుతుంది అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుందని విమర్శలు చేశారు.2014 ఎన్నికలలో పశ్చిమగోదావరి( West Godavari ) జిల్లాలో మొత్తం 15 స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది.మూడు ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది.

రాబోయే ఎన్నికల్లో కూడా “తెలుగుదేశం జనసేన” జైత్రయాత్రను ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.కానీ మొట్టమొదటిసారి 2019లో తప్పుడు అడుగు వేశారని అన్నారు.

ఇక వైసీపీ సినిమా అయిపోయింది.ఐదేళ్లలో ప్రజల జీవితాలు ఏమైనా మారాయా.? ఈ ముఖ్యమంత్రి మాయ మాటలు చెబుతున్నాడు అంటూ చంద్రబాబు విమర్శలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube