తెలంగాణ ఎఫెక్ట్.. బాబు న్యూ వర్షన్ !

తెలంగాణ ఎన్నికలు( Telangana elections ) ఏపీ రాజకీయల్లో గట్టిగానే ప్రభావం చూపుతున్నాయి.ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విధంగా బి‌ఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఏపీలోని ప్రధాన పార్టీలు కూడా అలెర్ట్ అయ్యాయి.

 Chandrababu New Plan In Allotment Of Seats, Telangana Elections , Chandrababu N-TeluguStop.com

పాలనపై, నేతలపై ప్రజా వ్యతిరేకత ఉంటే ప్రజలు నిరభ్యంతరంగా తిరస్కరిస్తారని తెలంగాణ ఎన్నికలు రుజువు చేయడంతో.ఏపీలోని ప్రధాన పార్టీలు లోటుపాట్లను సరిచేసుకునే పనిలో ఉన్నాయి.

మరోసారి అధికారమే లక్ష్యంగా ఉన్న వైఎస్ జగన్ ఇప్పటి నుంచే పార్టీ నేతలను నిత్యం ప్రజల్లో ఉంచుతున్నారు.అటు చంద్రబాబు కూడా తనదైన వ్యూహాలతో ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు.

Telugu Chandrababu, Congress, Lokesh, Telangana-Politics

ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ ఓటమి చంద్రబాబులో మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి.ముఖ్యంగా సీట్ల కేటాయింపులో బాబు కొంత అలెర్ట్ అయ్యారనే చెప్పాలి.తెలంగాణ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం సిట్టింగ్ లకు అధిక సీట్లు కేటాయించడం.చాలమంది అభ్యర్థులపై ప్రజావ్యతిరేకత ఉన్నప్పటికి తిరిగి వాళ్ళకే సీట్లు కేటాయించడంతో బి‌ఆర్‌ఎస్ ఓటమి చవిచూసిందనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు సీట్ల కేటాయింపుపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నవారికే సీట్ల కేటాయింపు జరపాలని చంద్రబాబు( Chandrababu NAIDU ) డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Telugu Chandrababu, Congress, Lokesh, Telangana-Politics

పనితీరు బాగాలేని నేతలను ఏ మాత్రం ఉపేక్షించబోనని, అలాంటి వారిని పక్కన పెడతానని, బాబు ఇటీవల స్పష్టం చేశారు.దీంతో పార్టీలో సీనియర్ల కు అధిక అవకాశం ఉంటుందా లేదా కొత్త వారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.కొత్తవారికి అధిక ప్రదాన్యం ఇస్తామని గతంలోనే చంద్రబాబు, లోకేష్ చెప్పుకొచ్చారు.అయితే పూర్తిగా కొత్తవారిపైనే ఆధారపడితే మరింత నష్టం తప్పదనే వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట.

ఇకపోతే జనసేన( Jana sena )తో పొత్తులో ఉన్న కారణంగా ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల విషయంలో కూడా ఆలోచించాల్సి వుంటుంది.మొత్తంమీద గెలుపే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు పూర్తిగా కొత్త ప్రణాళికలతో వ్యూహాలు రచిస్తున్నారు.

మరి చంద్రబాబు సీట్ల కేటాయింపులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొనున్నారు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube