తమ స్వలాభం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి పోలీసులను బలి పెడుతున్నారంటూ చంద్రబాబు( Chandrababu Naidu ) కీలక వ్యాఖ్యలు చేశారు.సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి కార్యక్రమంలో పాల్గొనటానికి తిరుపతి జిల్లా రేణిగుంట( Renigunta ) విచ్చేసిన చంద్రబాబు అక్కడ ఒక ఫంక్షన్ హాల్ లో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆ తర్వాత శ్రీకాళహస్తిలోని రోడ్ షోలో పాల్గొన్నారు.రాజకీయ పదవులు ఆశలు చూపి కొంతమంది పోలీసు అధికారులను ఈ ప్రభుత్వం లొంగదీసుకుంటుందని వారు ఉద్రిక్త పరిస్థితులు లోకి కిందిస్థాయి ఉద్యోగులను నడుతున్నారని పోలీసులందరూ ప్రభుత్వంపై తిరగబడాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
మీ కుట్రలకు చనిపోవడానికి నేను వివేకానంద రెడ్డిని కానని, మీరు ఒక కర్ర తెస్తే నేను రెండు కర్రలతో వస్తానంటూ ఫైర్ అయ్యారు.మా హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతాన్ని పూర్తి చేయకుండా నగరం నుండి హంద్రీనీవాకు 5300 కోట్లతో సమాంతర కాలువను నిర్మించడం ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు.
అదే నిధులతో ఈపాటికి హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి అయి ఉండేదని కేవలం తమ జేబులు నింపుకోవడం కోసమే ఇలాంటి కేటాయింపులు చేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) తరువాత అత్యధికంగా సంపాదించుకుంటున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.పరిపాలన ను పూర్తిగా అరాచకపు స్థాయికి తీసుకువచ్చేసారని వ్యవస్థలను తమకు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారని ఈ రాక్షస పాలనకు ముగింపు చెప్పాల్సిన సమయం దగ్గరకు వచ్చిందని రాయలసీమ ప్రజలే దానికి నాంది పలుకుతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కురుక్షేత్రం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అధికార కౌరవులపై తెదేపా పాండవుల చేసే దర్మ యుద్దం లో తమ విజయం తద్యమని, ప్రజలు ధర్మం వైపు నివబడాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు .