టిడిపి అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు.సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండడంతో , పార్టీ నాయకులు అందర్నీ అలర్ట్ చేస్తున్నారు.
నిత్యం పార్టీ శ్రేణులు జనాలకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.అధికార పార్టీ వైసీపీ దూకుడును అడ్డుకునేందుకు ఏం చేయాలనే విషయాల పైన పార్టీ నాయకులకు హితబోధ చేస్తున్నారు.
ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని కొన్ని పరిణామాలను తమకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి ? ఏ విధంగా వైసిపిపై పై చేయి సాధించాలి ? రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి ? ప్రజలను టిడిపి కి ఏ విధంగా చేరువ చేయాలి ? ఇలా అనేక అంశాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు హితబోధ చేస్తూనే ఉన్నారు.తాజాగా ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన జోన్ 2 సమావేశం జరుగునుంది.

ఏలూరు సమీపంలోని చోదిమెళ్ళ దగ్గర ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు పార్లమెంట్ స్థానాలను ఒక జోన్ గా విభజించి రాష్ట్రం మొత్తంగా ఐదు జోన్లు గా విభజించనున్నారు.పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఇప్పుడు కీలక సమావేశాన్ని నిర్వహిస్తారు.ఈరోజు జోన్ 2 పరిధిలోని ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ ,అమలాపురం స్థానాల నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, రంపచోడవరం నియోజకవర్గ నాయకులు హాజరుకానున్నారు.

అలాగే ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు, పరిశీలకులు , పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు .వీరందరికీ రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలపై చంద్రబాబు చర్చించనున్నారు.అలాగే ఓటర్ వెరిఫికేషన్ , కుటుంబ సాధికార సారధి ప్రక్రియ పైన శిక్షణ ఇవ్వనున్నారు.
అలాగే ప్రస్తుతం చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల పైనా చర్చించనున్నారు.







