టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఉనగట్లలో.రైతులను పరామర్శించారు.
ఇటీవల అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తాను రైతులను పరామర్శించడం మొదలుపెట్టాక ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఉభయగోదావరి జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అన్నారు.

అకాల వర్షాల కారణంగా 50% ఇంకా నీటిలోనే మునిగిపోయింది.వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం మాత్రమే కొనడం జరిగింది.మిగిలిన నీట మునిగిన పంట సంగతి ఏమిటని.
ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది.ఇదే సమయంలో ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని.
ప్రీమియం చెల్లించలేదని విమర్శించారు.రైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి ఇన్స్యూరెన్స్ కల్పిస్తారని.
రబీకి ఈ ప్రభుత్వం కట్టలేదన్నారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందుల వీడియోలు తీయాలని సూచించారు.
టీడీపీ ( TDP )అధికారంలోకి వచ్చాక ధాన్యం ఆరబోసేందుకు ప్లాట్ ఫారలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని చంద్రబాబు ఈ పర్యటనలో రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.







