తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నేడు విశాఖ ఆర్కే బీచ్ లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు జాతీయ జెండాతో సుమారు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం జరిగింది.అనంతరం ఎంజీఎం గ్రౌండ్( MGM Ground ) లో నిర్వహించిన బహిరంగ సభలో 2047 విజన్ డాక్యుమెంట్ నీ ఆవిష్కరించారు.భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
ప్రపంచంలో టాప్ 10 ధనవంతులలో ఐదుగురు యూదులు ఉన్నారు.
తెలుగు జాతి కూడా అంత గొప్ప స్థాయికి ఎదగాలన్నది తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.2047లో వందేళ్ళ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్నం.ఏ విధంగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పటినుంచే ఆలోచించాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ డాక్యుమెంట్ లో ప్రధానంగా ఐదు వ్యూహాలపై చంద్రబాబు వివరణ ఇచ్చారు.టెక్నాలజీ ఇంకా మేనేజ్మెంట్… గ్లోబల్ ఎకానమీ… సోలార్ ఎనర్జీ( Global Economy… Solar Energy ) ఇంకా అనేక విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరణ ఇవ్వటం జరిగింది.
ఇండియా ఇండియన్స్ తెలుగుస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో వందో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే లోపు ప్రపంచంలో భారత నెంబర్ వన్ అయ్యేందుకు ఏం చేయాలో చంద్రబాబు ప్రతి అంశాన్ని సవివరంగా వివరించారు.