లోకేష్ ఇలా అవుతాడని బాబు ఊహించలేదుగా ?

తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందో అనే బెంగ కంటే,  తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయం పైన టిడిపి అధినేత చంద్రబాబు టెన్షన్ పడుతూ ఉండేవారు.ఏదో రకంగా లోకేష్ రాజకీయంగా బలపడితే తాను యాక్టివ్ గా ఉన్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని బాబు భావిస్తూ వచ్చేవారు.

 Chandrababu Happy On Lokesh Present Situation, Chandrababu Naidu, Nara Lokesh, A-TeluguStop.com

అయితే లోకేష్ మాత్రం తండ్రి చాటు బిడ్డగా రాజకీయ వ్యవహారాలు చేస్తూ రావడం, పార్టీలో యాక్టివ్ అయ్యే క్రమంలో అభాసుపాలు అవ్వడం, ఇలా ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.దీంతో లోకేష్ రాజకీయ భవిష్యత్తు పై చంద్రబాబు చాలా టెన్షన్ పడుతూ కనిపించేవారు.

 గత కొంత కాలంగా లోకేష్ వ్యవహారం చూసుకుంటే చాలా యాక్టివ్ అయ్యారు.పార్టీలో పట్టు బాగా సంపాదించారు.ప్రసంగాలలోను ఎక్కడ తడబాటుకు గురవడం లేదు.అలాగే ఎక్కడైనా ప్రభుత్వ వేధింపుల కారణంగా ఇబ్బంది పడుతున్న పార్టీ నాయకులను పరామర్శిస్తూ, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు . రాజకీయ ప్రధాన ప్రత్యర్థి వైసీపీతో గట్టిగానే పోరాటం చేస్తున్నారు.ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

ఏపీలో అందుబాటులో లేకపోయినా హైదరాబాదు లోని తన నివాసం నుంచి సోషల్ మీడియా ద్వారా నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు.కొత్తగా పార్టీ పదవులను చంద్రబాబు  భర్తీ చేశారు దీంతో పార్టీ నాయకులలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
 ఆ పదవుల్లోనూ తనకు అనుకూలమైన నమ్మకస్తులు ఎక్కువ మంది ఉండేలా లోకేష్ చూసుకున్నారు.చంద్రబాబు ఉన్నా, లేకపోయినా తాను మీకు ఉన్నానంటూ నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే జిల్లాల వారీగా పర్యటన చేస్తూ,  ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ లోకేష్ హడావుడి చేస్తూనే ఉన్నారు.ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ, పార్టీ క్యాడర్ లో నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Active, Ap, Chandrababu, Jagan, Lokesh, Senior, Ysrcp-Political

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయింది అని హేళన చేసిన వారందరికీ ఇప్పుడు గట్టి సమాధానం చెప్పే పనిలో లోకేష్ ఉన్నారు.అన్ని విషయాలలో లోకేష్ ఈ విధంగా యాక్టివ్ అవ్వడం  చంద్ర బాబు కి మహా ఆనందం కలిగిస్తుందట.తాను లోకేష్ ను ఈ విధంగా చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అని, తాను అనుకున్న దానికంటే ఎక్కువగానే లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు అని బాబు తన సన్నిహితుల వద్ద ఆనందం వ్యక్తం చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube