బాబు కు దెబ్బ మీద దెబ్బ

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన చంద్రబాబు పరిస్థితి ఏమాత్రం అనుకూలించడం లేదు.

ఎదో సాధిద్దాం అని చూస్తున్న ఆయనకు అన్ని వైపులా నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

"ఉన్నాది పోయే ఉంచుకున్నాది పోయే" అన్న సామెతగా ఆయన పరిస్థితి తయారైంది.థర్డ్ ఫంట్ అని పాపం కాళ్లు అరిగేలా తిరిగినా కేంద్రంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు సరికదా ఏపీ ఉన్న అధికారం కూడా పోయింది.

దీనితో మీడియా కు కూడా మొహం చూపించలేని పరిస్థితి.అయితే ఇలాంటి పరిస్థితిలో బాబు కు మరో ఎదురుదెబ్బ తగిలింగి.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసి పెద్ద షాక్ ఇచ్చింది.ఈవీఎంలలో ఓటింగ్‌ను వీవీప్యాట్ స్లిప్పులతో పోల్చి చూడగా.100 శాతం కచ్చితత్వం కనిపించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఎన్నికల నిర్వహణ కోసం ఈసారి మొత్తం 22లక్షల 30 వేల బ్యాలెట్ యూనిట్లు, 16లక్షల 30వేల కంట్రోల్ యూనిట్లు, 17లక్షల 30వేల వీవీప్యాట్ యంత్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

Advertisement

అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం EVMల కౌంటింగ్ తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచీ లాటరీ ద్వారా 5 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను, ఈవీఎంలలో ఓటింగ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు సరిపోల్చిచూడగా ఎక్కడా తేడా జరగలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.దీనితో కేంద్రంలోని బీజేపీకీ, ఏపీలోని వైసీపీకీ, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు పడినవి ఒరిజినల్ ఓట్లేనని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పకనే చెప్పింది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు