Kodali Nani : జగన్ కి ఛాలెంజ్ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

2014 మాదిరిగా 2024 ఎన్నికలు( 2024 Elections ) గెలవాలని చంద్రబాబు( Chandrababu ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు ( Janasena Party ) పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో బీజేపీతో కూడా కలిసి అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు.2014లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ  కూటమి అధికారం కైవసం చేసుకోవడం జరిగింది.ఆ ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు.

కానీ మద్దతు తెలిపింది.ఇప్పుడు ఆ రకంగానే గెలవడానికి చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదే సమయంలో వైసీపీ( YCP ) యధావిధిగా ఒంటరిగా పోటీ చేస్తుంది.ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండటంతో నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.తాజాగా గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం జరిగింది.

Advertisement

సీఎం జగన్ కి( CM Jagan ) ఛాలెంజ్ చేసే అర్హత చంద్రబాబుకి లేదని అన్నారు.

అసెంబ్లీలో చర్చించే దమ్ము లేక సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేస్తున్నారు.దేశంలో ఇద్దరు పెద్ద నాయకులు ఎప్పుడైనా చర్చించుకున్నారా.? అలాంటప్పుడు ఎందుకు పదేపదే ఛాలెంజ్ చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు.

వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక మూడు పార్టీలతో కలసి వస్తున్నారు అంటూ చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు