టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో తీసుకున్న భద్రతా చర్యలపై ఏజీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ అదనపు డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా లేఖ రాశారు.
ఈ క్రమంలో చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు.
విజయవాడ ఏసీబీ కోర్టు సూచన మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు.చంద్రబాబుకు కేటాయించిన స్నేహ బ్లాక్ దగ్గర మూడంచెల భద్రత ఉందన్న ఆయన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
చంద్రబాబు కోసం వార్డులో ప్రత్యేక గది కేటాయించామన్న ఆయన ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేసి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.అంతేకాకుండా ప్రత్యేక వార్డు భద్రత కోసం ఆర్మ్ డ్ గార్డులను నియమించామని లేఖలో వెల్లడించారు.