లిక్కర్ మాఫియా వెనుక చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు

లిక్కర్ మాఫియా వెనుక చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని ఉపముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ బెల్టుషాపులు పెట్టె మద్యం విక్రయాలు ప్రోత్సహించింది ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడేనని విమర్శించారు.

 Chandrababu Behind Liquor Mafia. Deputy Chief Minister's Sensational Remarks,lat-TeluguStop.com

అసలు మద్యం నియంత్రణ అనేది చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు.మద్యపాన నియంత్రణ కోసం ప్రభుత్వం ఆలోచిస్తూంటే మద్యపానాన్ని కొనసాగించాలని తేదేపా ఉద్యమం చేస్తోందని నారాయణస్వామి ఆరోపించారు.

నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు కానీ చంద్రబాబు, తెదేపా ఉద్యమం చేస్తుందంటూ నారాయణస్వామి విమర్శించారు.

Telugu Ap Cm Jagan, Ap, Deputyministers, Yana Swamy, Ysrcp-Political

మద్యం కావాలనే ఉద్యమానికి చంద్రబాబు నాయుకుడని ఎద్దేవా చేశారు.చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తుంది అన్నారు.వైకాపా ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్య తగ్గిందన్నారు. ఈర్ష్య, ద్వేషం, పగ ఈ మూడు చంద్రబాబు లక్షణాలు కాబట్టే ప్రజాకోర్టులో చంద్రబాబు కు ఉరిశిక్ష వేశారని ఉపముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.

తాగుబోతులు, మద్యం వ్యాపారం చేసే వాళ్ళకే బ్రాండ్లు, ధరల గురించి తెలుస్తోందని చెప్పారు.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బెల్టుషాపులు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారన్నారు.మధ్యం ద్వారా ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తామని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.మద్యం నియంత్రణలో భాగంగా 2934 దుకాణాలను తగ్గించమని.

ఏపీలో ఎక్కడ అనుమతులు ఇవ్వలేదన్నారు.బోండా ఉమ మద్యం బాటిళ్లు పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు అని ధ్వజమెత్తారు‌ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube