విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని కూతురు శ్వేత.మాజీ స్పీకర్ కాజా రామనాథం మనవడు రఘు పెళ్లి హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ వివాహ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన భార్య భువనేశ్వరి సతీసమేతంగా హాజరయ్యారు.వధూవరులను చంద్రబాబు దంపతుల ఆశీర్వదించడం జరిగింది.
బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పెళ్లి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు తర పార్టీలకు చెందిన నాయకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ ఏడాది ఆగస్టు నెలలో హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కూడా పెళ్లి మాదిరిగానే చాలా ఘనంగా నిర్వహించారు.
ఇదిలా ఉంటే ఎప్పటి నుండో కేశినేని నాని పార్టీ వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి.చంద్రబాబుతో మనస్పర్ధలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో చంద్రబాబు సతీ సమేతంగా కేశినేని నాని కూతురు వివాహానికి వెళ్ళటం సంచలనగా మారింది.