ఇక బాబు పనైపోయిందా..? ఢిల్లీ లో ఏంజరుగుతోంది..?

కర్ణాటకలో హడావుడి అయిపోవడంతో ఇప్పుడు ఏపీ పై బీజేపీ పెద్దలు దృష్టిపెట్టారు.

చంద్రబాబు ని ఏదో ఒక అవినీతి విషయం లో ఇరుకున పెట్టి రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు.

అందుకే పాత విషయాలన్నీ కెలికే పనిలో ఉన్నారు బీజేపీ పెద్దలు.అందుకే ఏదైనా బలమైన ఆధారాలు సంపాదించి ఆ తరువాత చంద్రబాబు మీద ఆరోపణలు చేయించి.

వాటిపై విచారణ వేసి బాబు ని ఉక్కిరిబిక్కిరి చేయాలనే వ్యూహం పన్నుతోంది బీజేపీ.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతికి పాల్పడిందని కేంద్రం సమాచారం సేకరించింది.అయితే దీనిపై బలమైన సాక్ష్యాలు సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమయ్యింది.రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం సీబీఐ విచారణ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Advertisement

రాష్ట్రంలోని వివిధ కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించుకుని వారితో చర్చలు సాగిస్తోందట.గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ఏవైనా అవకతవకలు జరిగాయా ? జరిగితే ఎలా జరిగాయి ఎంత మేరకు అధికారపార్టీకి ముడుపులు ముట్టాయి ఎవరెవరికి ఎంత ఇచ్చారు ? అనే దానిపై వారితో చర్చిస్తున్నారట.టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసింది.

అనేక ప్రాజెక్టులను ఆగమేఘాలపై పూర్తి చేసి రైతులకు దాని ప్రతిఫలాలను అందించింది.ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకుని బిజెపి పెద్దలు చంద్రబాబు ను ఇరికించాలని చూస్తున్నారు.పట్టిసీమ కాంట్రాక్టర్‌ పై దృష్టిసారించారని ప్రచారం జరుగుతోంది.

పద్నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్‌ చేపట్టింది.అనుకున్న సమయం కన్నా ముందే పూర్తి చేస్తే కాంట్రాక్టరుకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

దీనిలో భాగంగానే .మెగా ఇంజనీర్‌ సంస్థ ప్రాజెక్టును ముందే పూర్తి చేసి రైతులకు మేలు చేకూర్చింది.దీంతో ప్రభుత్వం ముందుగా ఒప్పందం చేసుకున్న దాని కంటే ఎక్కువ చెల్లించింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దానిలో ఎవరికి ఎంత మేర వాటాలు ఇచ్చారో చెప్పాలని మెగా కృష్ణారెడ్డిని ఢిల్లీకి పిలిపించిందట.ఆ ప్రాజెక్టులో ఎవరికి ముడుపులు ఇచ్చారో చెప్పాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఇలా టీడీపీ హయంలో భారీ కాంట్రాక్టర్లు అందరిని బుజ్జగించో.భయపెట్టో చంద్రబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించే పనిలో కేంద్రం దూకుడుగా వెళ్తోంది.

తాజా వార్తలు