Chandra Mohan: మా నాన్న చంద్రమోహన్ గారు కర్మయోగి.. రియల్ హీరో.. కూతుళ్ల ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ విలక్షణ నటుడు, హీరో చంద్రమోహన్( Chandra Mohan ) అనారోగ్యాల కారణంతో నవంబర్ 11న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఒకటి రెండు కాదు దాదాపుగా 5 దశాబ్దాలకు పైగా తెలుగు సేవాపేక్షకులను ఆకట్టుకున్నారు చంద్రమోహన్.

 Chandra Mohans Memory Event Held In Hyderabad Legendary Actor Family Gets Emoti-TeluguStop.com

అలాంటి మంచి నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.నవంబర్ 11న ఆయన మరణించగా నవంబర్ 13వ తేదీ ఆయన అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే.

నేపథ్యంలో నవంబర్ 23వ తేదీన చంద్రమోహన్ సంస్మరణ సభను భావోద్వేగాల మధ్య నిర్వహించారు.

Telugu Chandra Mohan, Chandramohan, Hyderabad, Madhavi, Madhura, Tollywood-Movie

ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన దర్శకులు రేలంగి నరసింహారావు,( Relangi Narasimha Rao ) మాధవపెద్ది సురేష్,( Madhavapeddi Suresh ) నిర్మాత ప్రసన్నకుమార్, నటులు,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నవత అచ్చిబాబు, దర్శకులు ఇంద్రగంటి మోహన కృష్ణ, సతీష్ వేగేశ్న, హరీష్ లు హాజరయ్యారు.కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రమోహన్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ పెద్ద కుమార్తెలు మధుర,( Madhura ) మాధవి( Madhavi ) మాట్లాడుతూ తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్బంగా కూతురు మధుర మాట్లాడుతూ.

Telugu Chandra Mohan, Chandramohan, Hyderabad, Madhavi, Madhura, Tollywood-Movie

హర్డ్ వర్క్ ఒక్కటే బలం అని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు.నిన్ను ఎవరు విమర్శించినా, సమాజం మొత్తం విమర్శించినా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరూ నిన్ను ఆపలేరు అని చెప్పేవారు.నా జీవితంలో నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో నాన్నగారు.భౌతికంగా ఆయన మాతో లేకపోయినా మానసికంగా ఎప్పుడు మాతోనే ఉంటారు.మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతారు.నా దృష్టిలో ఆయన ఎప్పుడూ లివింగ్ లెజెండ్.

అందరి హృదయాల్లో ఆయన ఉంటారు అంటూ ఎమోషనల్ అయ్యింది మధుర.అనంతరం రెండవ కుమార్తె మాధవి మాట్లాడుతూ.

నాన్న కర్మయోగి.ఆయన నిర్మాతల ఆరిస్ట్.

ఆయనను మనసులో తలుచుకున్న వ్యక్తులు అందరూ మాతో ఉన్నట్లు మేం భావిస్తాము.మాకు ఎంతో మంది ఫోన్స్ చేశారు.

ఆయన అనుసరించి సిద్దాంతాలు, నియమాలు ఫాలో కావడం ముఖ్యం.జీవితంలో ఎలా బతకాలో మాకు ఆయన నేర్పించారు.

ఇక్కడికి వచ్చిన సినిమా కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది మాధవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube