కేసీఆర్ ను బుట్టలో వేసుకుంటున్న బాబు ! ఏంటి సంగతి 

రాజకీయంగా టిడిపి అధినేత చంద్రబాబు,  బీఆర్ఎస్ ( BRS party )అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )బద్ధ శత్రువులు.ఏపీ తెలంగాణ విభజనకు ముందు ఆ తరువాత ఇదే వైరం కొనసాగుతోంది.

 Chandra Babu Comments On Cm Kcr , Kcr, Telangana Cm, Telangana Cm Kcr, Ysrcp-TeluguStop.com

సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు కేసీఆర్.ఓటుకు నోటు వ్యవహారంలోనూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కేసీఆర్ చేయగా, దానికి అంతే స్థాయిలో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేశారు.

ఇక తెలంగాణలో టిడిపి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపుతూ పోరాటాలు చేస్తోంది.త్వరలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతుండగా,  కేసీఆర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తనం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కెసిఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.తెలంగాణలో కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులను చంద్రబాబు అభినందించారు.

Telugu Ap, Telangana Cm, Ysrcp-Politics

 కేసీఆర్ ప్రభుత్వం ప్రగతిశీల విధానాల వల్లే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు( Chandrababu Naidu ) పార్టీ కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలతో అన్నారు.ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా భూమి విలువ పెరుగుతుందని, సాగునీరు అందుబాటులో ఉంటే భూమి విలువ పెరుగుతుందని, పరిశ్రమలు, రోడ్లు వస్తే విలువ పెరుగుతుందని అన్నారు ఏపీలో ఒక ఎకరం భూమిని అమ్మితే హైదరాబాదులో నాలుగైదు ఎకరాలు కొనుగోలు చేసే అవకాశం ఒకప్పుడు ఉండేదని , కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని , హైదరాబాద్ లో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చు అని చంద్రబాబు అన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఏపీ తో పోల్చితే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని అన్నారు.

Telugu Ap, Telangana Cm, Ysrcp-Politics

ఏపీలో వైసీపీ ( YCP party )ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల భూమి విలువ పడిపోయిందని, జగన్ ( CM jagan )అధికార దాహంతో రాష్ట్రానికి శాపంగా మారిందని బాబు విమర్శించారు.కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం వెనుక కారణాలను విశ్లేషిస్తే జగన్ కు పరోక్షంగా, ప్రత్యక్షంగా కేసీఆర్ ఎటువంటి సాయం చేయకూడదని ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ విధంగా ప్రశంసలు కురిపిస్తూ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube