రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla )ఎల్లారెడ్డిపేట మండలంలో ఎగువ భాగం లో ఎడితెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరద ఉధృతి కి కిషన్ దాస్ పేట తిమ్మాసీ కుంట కట్ట తెగిపోయింది.
దీంతో కట్ట తెగిపోయి తిమ్మాసీకుంట( Thimmasi Kunta )లోని నీరంతా కింది భాగంలో కి వరద నీరు ప్రవహిస్తోంది.
దీంతో వరి నాట్లు వేసుకున్న పొలాలు ద్వంసం అయ్యి చాలా మంది రైతులు( Farmers ) తీవ్రంగా నష్టపోయారు.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.







