పూణేలోని చాందిని చౌక్ వంతెనను నేలమట్టం చేసిన ఇంజనీరింగ్ సంస్థ...వీడియో వైరల్

ముంబై – బెంగళూరు జాతీయ రహదారిపై పుణే లో ఉన్న ఈ వంతెన అత్యంత కీలకమైంది.అయితే దీన్ని బ్రిటీష్ కాలంలో అప్పటి అవసరాల మేరకు నిర్మించారు.

 Chandni Chowk Bridge In Pune Was Demolished By An Engineering Firm , Video Goes-TeluguStop.com

జాతీయ రహదారి విస్తరించినప్పటికీ బ్రిడ్జ్ ని వెడల్పు చేయకపోవడంతో ఈ వంతెన వద్ద నిత్యం ట్రాఫిక్ పెరిగిపోతూ వస్తుంది.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ చాందినీ చౌక్ వంతెనను కూల్చి దాని స్థానంలో మల్టీ బ్రిడ్జ్ ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో ఈ వంతెన కూల్చివేత ప్రక్రియ బాధ్యతలను ఇటీవల దేశంలో అత్యంత ఎత్తైన ట్విన్ టవర్లుగా ప్రఖ్యాతి చెందిన నోయిడా జంట టవర్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 9 సెకన్లలలో నేలమట్టం చేసిన ఎడిఎఫ్ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది.ఈ సంస్థ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శక్తివంతమైన పేలుడు పదార్ధాలు ఉపయోగించి ఈ వంతెనను కూల్చి వేసింది.

రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జ్ ని గత అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా కూల్చివేసినట్లు కలెక్టర్ రాజేశ్ దేశ్ ముఖ్ తెలిపారు.

మహారాష్ట్రలోని పూణేలో చాందినీ చౌక్ పాత వంతెనను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూల్చివేశారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా ట్విన్ టవర్లు కూల్చేసిన ముంబై సంస్థ ఎడిఎఫ్ ఇంజనీరింగ్ సంస్థనే ఈ చాందినీ చౌక్ వంతెనను నేలమట్టం చేసింది.

చాందినీ చౌక్ బ్రిడ్జ్ కూల్చివేతను ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే స్వయంగా పర్యవేక్షించారు.వంతెన కూల్చివేతకు ముందు ఆ ప్రదేశంలో సుమారు 8 గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేసి వేరే మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించారు.ట్విన్ టవర్ల కూల్చివేతకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానంతోనే చార్జింగ్ విధానంలో బ్రిడ్జ్ కి పేలుడు పదార్ధాలు అమర్చి ఆపై దాన్ని పేల్చారు.

దీంతో పెద్ద శబ్దంతో కుప్పకూలింది.ఈ వంతెన కూల్చి వేతకు 6 సెకన్ల సమయం మాత్రమే పట్టింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube