చల్లపల్లి అబ్బాయికి తైవాన్ దేశానికి చెందిన అమ్మాయికి వివాహం..

ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల( Dwaraka Tirumala )లో కృష్ణాజిల్లా చల్లపల్లి అబ్బాయికి తైవాన్( Taiwan ) దేశానికి చెందిన అమ్మాయికి ఈనెల 2వ తేదీ వివాహం జరిగింది.ఈ వివాహాన్ని పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు.

 Challapally Boy Married To Taiwanese Girl , Dwaraka Tirumala , Taiwanese Girl-TeluguStop.com

వధువు, ఆమె తల్లిదండ్రులు హిందూ సాంప్రదాయ రీతిలో వస్త్రాలు ధరించి వివాహ వేడుకను శాస్త్రవేత్తంగా నిర్వహించారు.అలాగే తైవాన్ దేశం నుంచి వచ్చిన వధువు బంధువుల సైతం హిందూ సాంప్రదాయ ఆచారాలను పాటించడం పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వరుడు సాయి దినకర్( Sai Dinakar ) తైవాన్ దేశంలో సించున్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు.అక్కడే ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న యు టింగ్ నియో అనే ఆమెతో పరిచయం మొదలై ఆ పరిచయం ప్రేమగా మారింది.

దీంతో ఇరువు పెద్దలను ఒప్పించి వారి ప్రేమ పెళ్లి పీటలకు చేరింది.ద్వారకా తిరుమల చిన వెంకన్న సన్నిధిలో వారి వివాహం ఘనంగా జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube