పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మీద టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయి ముగిసిపోయింది.కానీ ఆ ప్రకంపనలు, ఆ రాజకీయ వేడి ఇంకా తాగలేదు.
ఏపీక్ల్ ప్రత్యేక హోదా కల్పించకపోవడం వల్ల రాష్ట్రము చాలా వెనకబడిపోయిందని, విభజన తరువాత ఏపీ అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే.తప్పనిసరిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఏపీ లోని అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.
అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ తెలంగాణ నాయకులు కూడా రంగంలోకి దిగిపోయారు.ఆ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకొస్తున్నారు.
ఏపీకి ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాల్సిందే అనేది వారి ప్రధాన డిమాండ్.

ఇటీవల కాంగ్రెస్ జాతీయ సమగ్ర సమావేశంలో కూడా ఆ పార్టీ నేతలు వచ్చే ఎన్నికల్లో కనుక కేంద్రం లో అధికారం చేపడితే ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పటికే అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు తమకు తెలుసునని అన్నారు.ఏపీకి హోదా ఇస్తే మాకు కూడా హోదా అమలుచేయవలసి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఏపీకి హోదా ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ఒకవేళ వారికి హోదా కనుక ఇస్తే భారీ పరిశ్రమలన్నీ కూడా అక్కడికి తరలి పోతాయని, దానివల్ల తెలంగాణాలో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్తున్నారు.
అందువల్లనే తాము కూడా హోదా కోరుతునట్లు ఆయన చెప్తున్నారు.

ఇక రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో చెప్పినట్లు కొత్త విద్య సంస్థల ఏర్పాటు ఏమాత్రం జరగలేదని, నేడు ఈ విషయమై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేసారు.అయితే ఇప్పటికే ఈ విషయమై కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కూడా చర్చించడం జరిగిందని, అలానే కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ సహా పలువిద్య సంస్థల ఏర్పాటు త్వరితగతిన పూర్తిచేయాలని విన్నవించారట, అంతేకాక రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా మరింత అభివృద్ధిని పొందగలమని ప్రకాష్ జవదేకర్ తో కడియం చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఏపీ నేతలు మాత్రం ఈ డిమాండ్ పై గుర్రుగా ఉన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవడానికే తెలంగాణ నేతలు ఈ ఎత్తులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







