నేడు సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభం..

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది.సెంట్ర‌ల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెంట్రల్ విస్టా అవెన్యూను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు.

 Central Vista Avenue Will Start Today..-TeluguStop.com

సాయంత్రం 7 గంట‌ల‌కు ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.దీంతో పాటు ఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విగ్ర‌హాన్ని ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు.

అయితే, సెంట్ర‌ల్ విస్టా ప్రారంభానికి ముందే కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.రాజ్‎ప‌థ్ పేరును క‌ర్త‌వ్య‌ప‌థ్‎గా మార్చింది.

ఈ క‌ర్త‌వ్య‌ప‌థ్ పేరు మార్పును ఢిల్లీ మున్సిప‌ల్ కౌన్సిల్ ఆమోదించింది.రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్ నుంచి ఇండియా గేట్ వ‌ర‌కు క‌ర్త‌వ్య‌ప‌థ్ మార్గ్, డ్యూటీ పాత్ పున‌రుద్ధ‌రించారు.

పునరుద్ధరించిన స్ట్రెచ్‌లో నాలుగు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు డ్రోన్ షో కూడా జరగనుంది.

రాష్ట్రాల వారీగా ఫుడ్ స్టాల్స్, చుట్టూ పచ్చదనంతో కూడిన రెడ్ గ్రానైట్ రాయితో వేసిన మార్గాలు, వెండింగ్ జోన్‌లు, పార్కింగ్ స్థలాలు, మెరుగైన సదుపాయాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది.ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం ప్రాంతాన్ని డ్యూటీ పాత్ అని పిలవనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube